శాసనసభ 14వ తేదీకి వాయిదా

Mon,September 9, 2019 12:20 PM

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ ఈ నెల 14వ తేదీకి వాయిదా పడింది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభను ప్రారంభించిన అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. సుమారు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని చదివి వినిపించారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే సభను 14వ తేదీ(శనివారం)కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రెకటించారు.

1021
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles