కాసేపట్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పోలింగ్

Fri,December 7, 2018 06:30 AM

Telangana assembly elections begins Shortly

హైదరాబాద్: మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు సమస్యాత్మక నియోజకవర్గాల్లో(13) సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ను చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,80,64,684 మంది. వీరిలో పురుష ఓటర్లు 1,41,56,182 మంది.. మహిళా ఓటర్లు 1,39,05,811 మంది. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,691 మంది. అత్యధికంగా నగరంలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 5,75,541 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 1,37,319 మంది ఓటర్లు ఉన్నారు.

709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles