ప్రారంభమైన తెలంగాణ శాసనసభ సమావేశాలు

Mon,March 12, 2018 10:09 AM

telangana assembly budget session 2018

హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. గవర్నర్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అసెంబ్లీ హాలులో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఉభయసభలు వాయిదా పడుతాయి. ఆ తర్వాత శాసనమండలి, శాసనసభల కార్యకలాపాల సలహా సంప్రదింపుల కమిటీ (బీఏసీ) లు.. మండలి చైర్మన్ కే స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి అధ్యక్షతన భేటీ అయి బడ్జెట్ సమావేశాల షెడ్యూలును ఖరారుచేస్తాయి. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, సమయం, ఏయే రోజుల్లో సమావేశాలకు సెలవు ఇవ్వాలి, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో ఎన్ని రోజులు చర్చ జరగాలి, బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలి, బడ్జెట్‌పై ఎన్ని రోజులు చర్చ జరగాలి.. వంటి అంశాలపై నిర్ణయం తీసుకొంటారు. ఈ నిర్ణయాల మేరకు మంగళవారం నుంచి ఉభయసభల సమావేశాలు కొనసాగుతాయి.

1916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles