అసెంబ్లీ నిరవధిక వాయిదా

Sun,January 20, 2019 04:25 PM

హైదరాబాద్‌ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని నెరవేరుస్తుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సమాధానమిచ్చారు. తాము ఇచ్చిన హామీలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం సూచించారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో లేని 76 అంశాలను అమలు చేసినట్లు ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.

శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సమయంలో విపక్ష సభ్యులు లేవనెత్తిన పలు విషయాలపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. సీఎం ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత శాసనసభ నిరవధిక వాయిదా పడింది. అదేవిధంగా మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి మండలి ఆమోదం తెలిపిన అనంతరం శాసన మండలి నిరవధిక వాయిదా పడింది.

2151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles