పెద్దపల్లిలో యువకుడి దారుణహత్య

Tue,December 3, 2019 08:54 PM

పెద్దపల్లి : పెద్దపల్లి పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకుగురయ్యాడు. ఎస్‌ఐ ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన నిమ్మతి సదయ్య (28) వ్యవసాయంతోపాటు పాలు విక్రయిస్తుంటాడు. తనకు ఫోన్ వచ్చిందనీ, అప్పన్నపేట ఐకేపీ సెంటర్‌లో ఉన్న అమ్మకానికి సిద్ధంగా ఉన్న తన ధాన్యం దగ్గరికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే ఎంతసేపటికి సదయ్య రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.


పెద్దమ్మ వాడలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడని అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా, అప్పన్నపేటకు చెందిన పాలు అమ్ముకునే సదయ్యగా గుర్తించినట్లు ఎస్‌ఐ వివరించారు. సంఘటనా స్థలాన్ని పెద్దపల్లి జోన్ డీసీపీ రవీందర్ యాదవ్, ఏసీపీ హబీబ్‌ఖాన్, సీఐ ప్రదీప్‌కుమార్ పరిశీలించారు. సదయ్య తల్లి బాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉపేందర్‌రావు తెలిపారు.

2224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles