సచివాలయాన్ని పరిశీలించిన సాంకేతిక కమిటీ

Fri,July 12, 2019 04:58 PM

technical committee visits ts secretariat

హైదరాబాద్ : ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలోని పది భవనాలను సాంకేతిక కమిటీ ఇవాళ పరిశీలించింది. భవనాల నాణ్యత, స్థితిగతులు తదితర అంశాలను కమిటీ పరిశీలించింది. త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి సాంకేతిక కమిటీ నివేదిక ఇవ్వనుంది.

సచివాలయం తరలింపు, నూతన సచివాలయ నిర్మాణం, అసెంబ్లీ నూతన భవన నిర్మాణం అంశాలపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షుడిగా, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ భవనాలలో ఉన్న సౌకర్యాలను, భవనాల పరిస్థితిపై అధ్యయనానికి ఇంజినీరింగ్ చీఫ్‌లతో మంత్రివర్గ ఉపసంఘం సాంకేతిక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో ఈఎన్సీలు రవీందర్, మురళీధర్, సత్యనారాయణరెడ్డి సభ్యులుగా ఉన్నారు.

1195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles