ఓటు ఔనత్యాన్ని చాటిన ఉపాధ్యాయులు

Fri,March 22, 2019 08:43 PM

teachers travel 250 km to vote in teacher mlc elections in jagityal dist

-250 కిలోమీటర్లు వెళ్లి ఓటు హక్కు వినియోగం
-రెవెన్యూ అధికారుల తప్పిదంతోనని వెల్లడి

జగిత్యాల: ఓటు హక్కును వినియోగించుకోవడం తమ కర్తవ్యమని భావించిన ఉపాధ్యాయులు, దూర భారం ఎక్కువైనా ఓటు వేసి ఓటు ఔనత్యాన్ని చాటారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందనే స్ఫూర్తిని చాటారు. ఉపాధ్యాయ, పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం రాయికల్ మండలంలోని 24 మంది దరఖాస్తు చేసుకున్నారు.

వీరందరికీ పట్టభద్రుల ఓట్లు రాయికల్ పోలింగ్ కేంద్రంలోనే వచ్చాయి. ఉపాధ్యాయ ఓట్లు మాత్రం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వచ్చాయి. వీరంతా ఉదయం పట్టభద్రుల ఓట్లు రాయికల్ పోలింగ్ కేంద్రంలో వేసి, అనంతరం ఉపాధ్యాయ ఓట్లు వేసేందుకు సంగారెడ్డి వెళ్లారు. రాయికల్ నుంచి సంగారెడ్డి 250 కిలోమీటర్ల దూరం కాగా 6 గంటలపాటు ప్రయాణించి ఓటు వేసి స్ఫూర్తిగా నిలిచారు. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల పోను రాను 500 కిలోమీటర్లు 12 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు వాపోయారు.

2403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles