ఒమన్‌లో టీచర్ జాబ్ ఇప్పిస్తామంటూ...

Fri,June 7, 2019 09:04 AM

Teacher job in Oman fraud

హైదరాబాద్ : విదేశాల్లో టీచర్ జాబ్ కోసం నౌకరీ.కామ్‌లో దరఖాస్తు చేసుకున్న ఓ టీచర్‌కు సైబర్ చీటర్లు రూ. 3.57 లక్షలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళ్లితే... సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన ఓ టీచర్ ఒమన్ దేశంలో ఆంగ్ల భాషలో టీచర్‌గా పనిచేయడానికి నౌకరీ.కామ్‌లో దరఖాస్తు చేసుకుంది. అనంతరం ఆమెకు అమిత్ మహాజన్, నిషా, మోనా శర్మ, ధనాయి కుమార్ మిశ్రా, అఖండ్ ప్రతాప్ సింగ్‌ల పేర్లతో ఫోన్‌లు చేసి.. మీకు ఒమన్‌లో ఇంగ్లీషు టీచర్‌గా ఉద్యోగం ఖాయమంటూ నమ్మించారు. మీరు అక్కడికి వెళ్లి ఉద్యోగం చేయాలంటే... మా నిబంధనల ప్రకారం కొంత నగదును చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. డబ్బు చెల్లించిన తర్వాత మీ వీసా ఇతర అంశాలను పూర్తి చేస్తామని చెప్పారు. ఇది నిజమేనని నమ్మిన ఆమె దఫ దఫాలుగా మొత్తం రూ. 3.57 లక్షలను చెల్లించింది. ఆ తర్వాత వారిని సంప్రదించగా ఫోన్‌లు స్విఛ్ ఆఫ్ వచ్చారు. దీంతో మోసపోయానని గ్రహించి రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తులో బాధితురాలు జమ చేసిన ఖాతాలను ఆరా తీయగా అవి పంజాబ్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందినవిగా తేలింది.

1708
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles