టోల్‌ప్లాజాల వద్ద టీ, టిఫిన్ ఏర్పాట్లు!

Fri,January 19, 2018 10:17 PM

Tea and Tiffins available at Toll Plazas

న్యూఢిల్లీ: భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్వహిస్తున్న టోల్‌ప్లాజాల వద్ద తాగునీరు, తేనీరు, ప్యాకేజ్డ్ ఫుడ్ విక్రయించే దుకాణాలను (హైవే నెస్ట్) అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రం వెల్లడించింది. జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్న వారి సౌకర్యార్థం.. దేశవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 372 టోల్‌ప్లాజాలకు 200, 250 మీటర్ల దూరంలో వీటికి తగిన ఏర్పాట్లు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా దివ్యాంగులతోపాటు అందరికీ మరుగుదొడ్లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నది. ఇప్పటికే 76వ నంబర్ జాతీయ రహదారిపై ఉదయ్‌పూర్ చిత్తోడ్‌గఢ్- కోట మార్గంలో నారాయణ్‌పురా వద్ద, ఆంధ్రప్రదేశ్ నుంచి సాగే 65వ జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ సెక్షన్‌పై కొర్లపహాడ్ వద్ద వీటిని ప్రారంభించామన్నది. మిగతా టోల్‌ప్లాజాల వద్ద మార్చిలోగా నిర్మిస్తామని వివరించింది.

2054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles