ఆరోగ్యశ్రీ రోగులవద్ద టీడీఎస్ పేరుతో డబ్బులు వసూలు

Tue,May 21, 2019 09:17 AM

TDS fraud at Aarogyasri patients in hyderabad

హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులను టీడీఎస్ పేరుతో మభ్యపెట్టి డబ్బులు దండుకుంటున్న గుర్తు తెలియని వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన ఉపేందర్ కుమార్ ఫిబ్రవరిలో బంజారాహిల్స్ రోడ్ నం.1లోని విరించి దవాఖానలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. డబ్బు చెల్లించిన తర్వాత ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేసుకోవచ్చని దవాఖాన వర్గాలు చెప్పగా...దరఖాస్తు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా... ఈ నెల 2న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు ఆరోగ్యశ్రీ కింద చెక్కు సిద్ధం గా ఉంది, చెక్కును విడుదల చేయాలంటే టీడీఎస్ కింద రూ.5,729 చెల్లించాలని చెప్పగా చెల్లించాడు. కాగా.. బాధితుడు జూబ్లీహిల్స్ రోడ్ నం.46లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయానికి వచ్చి చెక్కును తీసుకుంటున్న సమయంలో టీడీఎస్ పేరుతో తాను బ్యాంకులో వేసిన డబ్బుల గురించి చెప్పాడు. గుర్తుతెలియని వ్యక్తి మోసం చేస్తున్నట్లు గుర్తించిన ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఈవో గోపికాంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

1570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles