ప్రభుత్వంపై ఎమ్మెల్యే సండ్ర ప్రశంసలు

Sat,February 23, 2019 12:03 PM

TDP MLA Sandra Venkata Veeraiah praises on TRS Govt

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రశంసల వర్షం కురిపించారు. శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, పంటలను కాపాడేందుకు విద్యుత్‌ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలన్నీ భవిష్యత్‌లో సక్రమంగా అమలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు తమ సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం గురుకులాలను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. దళితులకు ప్రత్యేక యూనివర్సిటీ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు కోసం ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు.

సత్తుపల్లిని జిల్లాగా ప్రకటించండి
పరిపాలనా సంస్కరణల వల్ల ప్రజలకు పాలన చేరువైందన్నారు. ఇటీవలే ములుగు, నారాయణపేటను కొత్త జిల్లాలుగా ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి సత్తుపల్లి కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని ఆయన కోరారు. ఇక్కడి 6 లక్షల ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని సండ్ర విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి తమ సహాయం ఉంటుందని సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు.

2872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles