నేనెగరేస్తా.. కాదు నేనే.. గొడవపడ్డ తెలుగు తమ్ముళ్లు!

Wed,August 15, 2018 09:41 PM

tdp leaders dispute for hoisting flag in mancheryal dist

మంచిర్యాల: ఉన్నదే నలుగురు నేతలు... అందులో పతాకావిష్కరణ కోసం గొడవలు.. ఇది చూసి అవాక్కైన కార్యకర్తలు.. ఇదీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో జెండా ఎగురవేసేందుకు జిల్లా అధ్యక్షుడు శరత్ అక్కడికి చేరుకున్నాడు. అయితే ఆయన పతాకావిష్కరణకు సిద్ధమవుతుండగా తెలుగుదేశం నాయకుడు గోపతి మల్లేశ్ అడ్డుకున్నాడు.

జెండా ఎగురవేసేందుకు నువ్వు ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొన్నేళ్లుగా ఇక్కడ తానే జెండా ఎగరేస్తున్నాననీ, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావంటూ నిలదీశాడు. శరత్‌బాబు వర్గం అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. శరత్‌బాబును తాగి వచ్చి జెండా ఎత్తుతావా? అంటూ నిలదీశాడు. నలుగురు కార్యకర్తలను తీసుకురాలేని నువ్వు కూడా జెండా ఎత్తుతావా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా దాదాపు 15 నిమిషాల పాటు వాగ్వాదం చోటు చేసుకుంది. శరత్‌బాబును పతాకావిష్కరణ చేయకుండా గోపతి మల్లేష్ ఆయన చేతుల్లో నుంచి జెండా లాక్కొని తానే పతాకావిష్కరణ చేశాడు. కాసేపు అక్కడే ఉన్న జిల్లా అధ్యక్షుడు శరత్‌బాబు ఏం చేయాలో దిక్కుతోచక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇంతా చేస్తే అక్కడ పట్టుమని పది మంది కార్యకర్తలు లేకపోవడం గమనార్హం. ఉన్న ఇద్దరు నాయకులు గొడవపడితే ఇక పార్టీ పరిస్థితి ఏమిటని కార్యకర్తలు గొణుక్కుంటూ వెళ్లిపోయారు.

9917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles