టీసీఎస్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు

Wed,July 18, 2018 07:29 AM

TCS conducts Quiz competitions

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అతిపెద్ద క్విజ్ పోటీలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆగస్టు 1వ తేదీన హైదరాబాద్ నగరంలోని భారతీయ విద్యాభవన్, కింగ్‌కోఠీ రోడ్ బషీర్‌బాగ్‌లో నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ క్వీజ్ పోటీలకు 8 నుంచి 12వ తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులని వివరించారు. ఇద్దరు సభ్యులతో కూడిన 10 గ్రూపులను పంపవచ్చునని తెలిపారు. ఇందుకోసం ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 25వ తేదీలోపు తమ వివరాలను క్విజ్ సమన్వయకర్త, టీసీఎస్ ఐటీ విజ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, సాఫ్ట్‌వేరు యూనిట్స్, మదుపూర్ అడ్రస్‌కును సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈమెయిల్ nimesh.varma@tcs.com, ఫోన్ నంబర్‌ను 9705391007 సంప్రదించాలని సూచించారు. www.tcsitwiz.com వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు పొందుపర్చినట్లు తెలిపారు.

918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles