టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రారంభం

Thu,March 1, 2018 12:01 PM

TATA Boeing Aerospace Ltd starts at Adibhatla

రంగారెడ్డి: వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిభట్లలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ నేడు ప్రారంభమైంది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, ఎంపీలు కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వైమానిక సెజ్‌లో విమాన విభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్ 18న అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, టాటా గ్రూపుల చైర్మన్ రతన్ టాటా, తెలంగాణ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, బోయింగ్ సంస్థలు కలిసి టాటా బోయింగ్ ఏరో స్పేస్ లిమిటెడ్ ఉమ్మడి సంస్థను ఏర్పాటుచేశాయి. దీని ఆధ్వర్యంలో మైమానిక సెజ్‌లో 13 ఎకరాల్లో రూ.200 కోట్లతో పరిశ్రమను నిర్మించాయి. బోయింగ్ ఏహెచ్ 64 విమానాల విడిభాగాలకుతోడు అపాచీ హెలికాప్టర్లను ఇందులో తయారుచేయనున్నారు. వీటికి అమెరికా సహా 15 దేశాల్లో బాగా డిమాండ్ ఉంది.

2064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS