గోదావరిలో గల్లంతైన పాశం తరుణ్‌రెడ్డి మృతదేహం లభ్యం

Tue,September 17, 2019 12:59 PM

నల్లగొండ: ఆదివారం తూర్పుగోదావరి జిల్లా పాపికొండల టూర్‌లో పడవ మునిగి గల్లంతైన పాశం తరుణ్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతుడి స్వస్థలం నల్లగొండ జిల్లా అనుముల మండలం రామడుగు గ్రామం. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కొద్ది సేపట్లో మృతుడి బంధువులకు శవాన్ని అప్పగిస్తారు. మంత్రి పువ్వాడ అజయ్ తరుణ్ మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటి వరకు 19 మంది మృతదేహాల లభమయ్యాయి. తెలంగాణమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉన్నారు.


నదిలో ప్రవాహ ఉధృతి, వర్షం కురుస్తున్న కారణంగా సహాయకచర్యలకు అంతరాయం కలుగుతున్నది. ఎనిమిది ఈఆర్ బృందాలు, 12 గజ ఈతగాళ్ల బృందాలు, ఆరు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, రెండు ఎస్డీఆర్‌ఎఫ్ బృదాలు, నేవీచాప్టర్, ఓఎన్జీజీసీ చాప్టర్ ప్రత్యే క బృందాలు గాలింపులో పాల్గొంటున్నాయి.

3743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles