కాంగ్రెస్ నేతలు కళ్లు లేని కబోదులు : మంత్రి తలసాని

Mon,September 3, 2018 12:14 PM

Talasani Srinivas Yadav fire on Telangana Congress Leaders

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కళ్లు లేని కబోదులు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరును మంత్రి తలసాని తప్పుబట్టారు. ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నిన్న జరిగిన ప్రగతి నివేదన సభకు లక్షలాది మంది తరలివచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా సభ విజయవంతమైందన్నారు. ఏ పార్టీ సభలకైనా ఆర్టీసీ బస్సులను వాడుకుంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కనబడటం లేదన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. పేదింటి ఆడపిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద ఆర్థికసాయం చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి తలసాని గుర్తు చేశారు.

1902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles