ఆ పేరు వింటేనే చంద్రబాబుకు వణుకు

Thu,January 17, 2019 03:36 PM

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, సనత్ నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఫెడరల్ ఫ్రంట్ పేరు వింటేనే చంద్రబాబుకు వణుకు పుడుతుందని తలసాని స్పష్టం చేశారు. ఇటీవల ఏపీకి వెళ్లిన తలసాని.. దుర్గ గుడి వద్ద రాజకీయాలు చేశారని చంద్రబాబు అన్నారు. బాబు చేసిన వ్యాఖ్యలపై తలసాని మీడియాతో మాట్లాడారు.


చంద్రబాబులాగా దేవాలయాల వద్ద రాజకీయాలు చేసే అలవాటు లేదు. నాకు అక్కడ బంధువులు ఉన్నారు. బంధుత్వాలు, బంధాల విలువ చంద్రబాబుకు తెలియదు. హరికృష్ణ చనిపోతే అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడిన నీచమైన సంస్కృతి చంద్రబాబుది. నేను మొన్న ఏపీకి వచ్చినందుకు బాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇలాగే హెచ్చరికలు చేస్తే బీసీలెవరూ టీడీపీలో ఉండరు. ఈ దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో.. ఫెడరల్ ఫ్రంట్ వేదికగా వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులను, నాయకులను కలుస్తున్నారు. దీంతో బాబుకు వణుకు పుట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తే సమాధానం తీవ్రంగా ఉంటుంది. కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబే. మాల,మాదిగలకు, బీసీలకు, కాపులకు గొడవ పెట్టింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబు టీఆర్‌ఎస్ పార్టీ గురించి మాట్లాడడం దారుణం. ఈ బాబు మాకొద్దు అనే నినాదంతో ముందుకు పోతున్నామని ఆంధ్రా ప్రజలు చెప్పారు. ముసుగు తీసిన దొంగలు మీరు.. ఆ నాటకాలేంటో బయటపెడుతాం.

చంద్రబాబుకు టైం దగ్గరపడ్డది. ఎన్టీఆర్ అభిమానులే చంద్రబాబును సాగనంపాలని చూస్తున్నారు. నేను వందశాతం రాజకీయాలు మాట్లాడుతాను. ఏపీలో తప్పకుండా రాజకీయాలు చేస్తాం. అక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్లున్నారు. నేను ఆంధ్రాలో బీసీ నాయకులను కలిస్తే చంద్రబాబుకు భయం పుట్టుకుంది. బడుగు, బలహీన వర్గాలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది. నేను ఏపీకి వెళ్తే ఆ స్థాయిలో ప్రజాస్పందన ఉంటే.. మా సీఎం కేసీఆర్ వెళ్తే ఏ రేంజ్‌లో స్పందన ఉంటుందో ఊహించుకోండి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

5209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles