సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు : హరీష్‌రావు

Sat,June 3, 2017 03:45 PM

take serious actions on private hospitals, says harish rao

సిద్ధిపేట : గర్భిణులకు అనవసరంగా సిజేరియన్లు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. సిద్ధిపేట మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గర్భిణుల కోసం కేసీఆర్ కిట్ పథకాన్ని సీఎం ప్రారంభించారని తెలిపారు. రాబోయే రోజుల్లో సిజేరియన్లు క్రమక్రమంగా తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరమున్నా.. లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారని, దీని వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పేరిట గత ప్రభుత్వం ఆస్పత్రులను అధ్వాన్న స్థితిలోకి మార్చాయని ధ్వజమెత్తారు. తెలంగాణ సర్కార్ వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్న ఆయన నెల రోజుల్లో సిద్ధిపేటలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాబోయే 3 నెలల్లో సిద్ధిపేటలో 300 పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసుకుంటామని పేర్కొన్నారు. సిద్ధిపేటకు సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సిద్ధిపేట ఏంసీహెచ్ దవాఖానకు వచ్చే రోగులతో పాటు వారి బంధువులకు కూడా భోజనామృతం పథకం అమలు చేస్తూ.. అందరి ప్రశంసలు పొందుతున్నట్లు మంత్రి చెప్పారు.

872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles