వేసవి సెలవులు..పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Tue,April 16, 2019 08:47 AM

Take care of your children in Summer holidays

బషీరాబాద్‌: మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 13వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. పాఠశాల తిరిగి జూన్‌ ఒకటో తేదీన ప్రారంభయవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ 49 రోజులు వేసవి సెలవులు.. పిల్లల తల్లిదండ్రులకు పెద్ద పరీక్షా కాలంగా చెప్పవచ్చు. పాఠశాలలకు సెలవులు రావడంతో తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పని ఉన్నప్పటికి పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదం జరిగాక.. బాధపడేకంటే ముందే జాగ్రత్తపడి సంతోషంగా ఉండటం మంచిదని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఈ జాగ్రత్తలు అవసరం..


* చెరువుల్లో, బావుల్లో ఈతకు పంపించొద్దు.. అవసరమైతే ఈత నేర్పించేందుకు పిల్లలతో తప్పకుండా వెళ్లాలి.
* మోటార్‌ సైకిల్‌ను ఇవ్వరాదు.. వాటి తాళాలు పిల్లలకు కనిపించకుండా ఉండేలా జగ్రత్త అవసరం
* మొబైల్‌ ఫోన్‌లను వాడనివ్వకూడదు.
* స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకూడదు.
* వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని మన సంప్రదాయాలను నేర్పించాలి.
* ఇంట్లో పెద్దలు ఉంటే వారితో ఎక్కువ సమయం కేటాయించేలా తల్లిదండ్రులు చూడాలి.
* సంప్రదాయ పనులు చెప్పాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వేసవి సెలవులు ఇట్టే గడిచిపోతాయి.

1925
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles