డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావుగౌడ్

Mon,February 25, 2019 10:13 AM

T Padmarao Goud appointed as Deputy Speaker Of Telangana Assembly

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అనంతరం పద్మారావుగౌడ్‌ను సీఎం కేసీఆర్, ప్రతిపక్ష సభ్యులు కలిసి తీసుకెళ్లి సీట్లో కూర్చొబెట్టారు.
ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ కు స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది.


రాజకీయ ప్రస్థానం
తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీలో పద్మారావుగౌడ్ 2001లో చేరారు. 2004లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009లో సనత్‌నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పద్మారావు గౌడ్.. కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు పద్మారావు. తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌లో ఎక్సైజ్, అబ్కారీ మరియు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా పద్మారావుగౌడ్ పని చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొందారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీలో చేరే కంటే ముందు పద్మారావుగౌడ్.. హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్‌గా సేవలందించారు.

1954,ఏప్రిల్ 7వ తేదీన సికింద్రాబాద్‌లో పద్మారావు గౌడ్ జన్మించారు. పద్మారావుగౌడ్‌కి స్వరూప రాణితో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

3112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles