సీఎం కేసీఆర్‌పై టీన్యూస్ స్పెషల్ సాంగ్

Fri,October 19, 2018 04:29 PM

T News Special Song on CM KCR

హైదరాబాద్: అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేశారు సీఎం కేసీఆర్. 60 ఏళ్ల తెలంగాణ కలను సీఎం కేసీఆర్ నిజం చేశారు. తెలంగాణ ప్రజల కోరిక నెరవేరింది. ఇప్పుడు తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. 60 ఏళ్లతో గత పాలకులు చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారు. ఉద్యమ నేతగా తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం, తెలంగాణ సీఎంగా ఆయన చేసిన అభివృద్ధి.. అన్నింటినీ కలిపి టీన్యూస్ చానెల్ సీఎం కేసీఆర్ మీద స్పెషల్ సాంగ్‌ను రూపొందించింది. ఆ పాటను ఇవాళ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది.. ఒక కంఠం కోటి గొంతుకల ఉద్యమ రణ... అంటూ సాగే పాటను వీరేంద్ర కాపరి రాయగా.. జై శ్రీనివాస్ ఆలపించాడు. ఏఆర్‌కే రాజు ఆ పాటకు మ్యూజిక్ అందించగా సైదిరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

3982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles