ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

Sat,January 12, 2019 04:27 PM

swamy vivekananda birth anniversary celebrations at Harihara junior college in Aiza

జోగులాంబ గద్వాల : జిల్లాలో స్వామి వివేకానంద 156వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐజలోని హరిహర జూనియర్ కళాశాలలో నిర్వహించిన వివేకానంద జయంతి వేడుకల్లో కాలేజీ ప్రిన్సిపల్ శివశంకర్, అధ్యాపకులు రాజశేఖర్, శ్రీను, నర్సింహులు, శూరకర్ణ, సుధాకర్, ఆంజనేయులు, రమేశ్, శివుడు, అశోక్, నోడల్ ఆఫీసర్ హృదయరాజు, టీ ఆర్ ఎస్ వీ కోఆర్డినేటర్ పల్లయ్యతో పాటు విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు. నిరాశ, నిస్పృహలలో ఉన్న ప్రతి ఒక్కరికీ వివేకానంద బోధనలు చైతన్యవంతం చేస్తాయని ప్రిన్సిపల్ శివశంకర్ అన్నారు. యువత ప్రతీ ఒక్కరూ వివేకానందుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భారతీయ విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు వివేకానందుడు అని ప్రిన్సిపల్ తెలిపారు.

1555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles