అవినీతి పోలీసుల సస్పెన్షన్

Tue,December 3, 2019 10:01 PM

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అవినీతి ఆరోపణలపై సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రాంబాబు, హోమ్‌గార్డ్‌లు కె. అంకారావు, గోపాల్‌లను విధులనుంచి సస్పెండ్ చేశారు. అలాగే, సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వి. రామ్‌చందర్‌కు చార్జ్‌మెమో జారీచేయడంతోపాటు ఆయన్ను ప్రధాన కార్యాలయానికి బదిలీచేశారు. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తున్నట్లు, ప్రజలు ఎవరైనా పోలీసుల అవినీతిపై తమకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తిచేశారు.

624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles