కోమటి చెరువుపై లక్నవరం తరహాలో వ్రేలాడే వంతెన

Fri,June 7, 2019 12:28 PM

suspension bridge on Komati cheruvu like laknavaram

సిద్దిపేట: కోమటి చెరువుపై లక్నవరం తరహాలో సస్పెన్షన్ బ్రిడ్జ్(వ్రేలాడే వంతెన) ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్టానికే రోల్ మోడెల్ గా, పర్యాటక ప్రాంతంగా నిలుస్తున్న సిద్దిపేట కోమటి చెరువును ఎమ్మెల్యే నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్నవరంలో ఉన్న మాదిరిగా, అదే తరహాలో కోమటి చెరువుపై వ్రేలాడే వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కోమటి చెరువుపై ఇటీవలే జిప్ సైక్లింగ్, ఇతర సాహస క్రీడలు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం అని.. కొద్దీ రోజుల్లోనే కోమటి చెరువుకి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాబోతున్నాయన్నారు. కోమటి చెరువుని ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే విదంగా చర్యలు చేపడతామన్నారు. కోమటి చెరువుపై ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఇరిగేషన్, టూరిజం, మున్సిపల్ అధికారులకు సూచించారు. వెంటనే పనులు ప్రారంభించి వచ్చే రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసీ అందుబాటులోకి తేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణ అధికారి ఆనంద్, ఈఈ రవీందర్ రెడ్డి, టూరిజం డీఈ సుధాకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఏఈ విష్ణు, మున్సిపల్ డీఈ లక్ష్మన్ పాల సాయిరాం, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

1631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles