సూర్యాపేట జిల్లా విద్యార్థినికి ఐసెట్‌లో 5వ ర్యాంకు

Fri,June 14, 2019 07:00 PM

Suryapet district girl students gets fifth rank in icet 2019

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం: లిక్కి భార్గవి
కోదాడ: విద్యుత్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని ఇవాళ విడుదలైన ఐసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన లిక్కి భార్గవి తన అభిప్రాయం తెలిపారు. తండ్రి లిక్కి అంజయ్య ప్రస్తుతం మండల పరిధి తొగర్రాయి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి రమాదేవి గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె సహన గత సంవత్సరం ఐసెట్ 25వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్నారు.

రెండో కుమార్తె భార్గవి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ (ఈఈఈ) పూర్తి చేసి ఐసెట్‌లో 5వ ర్యాంకు సాధించారు. బీటెక్ ఫైనల్ ఇయర్‌లోనే కళాశాలలో మూడు కంపెనీలలో ఉద్యోగానికి ఎంపికైనట్లు భార్గవి తెలిపారు. ఎంబీఏ చదువుతూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

1689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles