సీఎం కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించిన సూపర్‌స్టార్ కృష్ణ దంపతులు

Mon,December 7, 2015 08:14 PM

super star krishna invited CM KCR for marriage

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయ నిర్మల ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి తన సోదరుడు ఆదిశేషగిరిరావు కుమారుడి వివాహానికి హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. కాగా, ఆదిశేషగిరిరావు కుమారుడు రత్నబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరి హైమావతి మనువరాలు ప్రియాంకను ఇచ్చి వివాహం జరిపిస్తున్నారు. కాగా, నిన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు కృష్ణ దంపతులు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే.

1831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles