ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సూపర్ 30 అవార్డు

Tue,October 22, 2019 06:50 AM

హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయుడు సీహెచ్ శ్రీనివాస్‌ను సూపర్ 30 టీచర్స్ అవార్డు వరించింది. అత్యుత్తమ బోధనకు గాను దేశవ్యాప్తంగా 30 మంది ఉపాధ్యాయులకు ఐబీ హబ్ సంస్థ ఈ అవార్డులను ఏటా అందజేస్తున్నది. ఈ ఏడాది దేశంలోని ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో ఉపాధ్యాయుడిని దాదాపు 35000 మంది విద్యార్ధులు ఓట్లు వేసి ఎంపిక చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి సీహెచ్ శ్రీనివాస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈయన ప్రస్తుతం జగిత్యాల జిల్లా ఓబులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles