సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్న సునీల్ అరోరా

Fri,November 30, 2018 10:09 PM

Sunil Arora appointed new Chief Election Commissioner

న్యూఢిల్లీ : ఎన్నికల్లో పార్టీల ప్రచార ఖర్చుపై పరిమితి నిబంధన త్వరలోనే అమలులోకి వస్తుందని పదవీవిరమణ చేస్తున్న ఛీఫ్ ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ పేర్కొన్నారు. శనివారం సీఈసీగా ఆయన పదవీ విరమణ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇప్పటికే నియమితులైన సునీల్ అరోరా ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తారు. రావత్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అధిపతిగా ఎన్నికల్లో డబ్బు వినియోగం, సామాజిక మాధ్యమాల వినియోగంపై కాలాగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు (లీగల్ ఫ్రేంవర్క్) తీసుకునే విషయంలో కేంద్ర న్యాయశాఖకు తగిన సిఫారసులు చేయలేదనే ఒకే ఒక్క బాధ తనకు ఉన్నదని తెలిపారు.

రాజకీయ పార్టీలకు ఇచ్చే నిధుల విషయంలో పారదర్శకత అంశం గురించి స్పందిస్తూ ఇది ఒక దీర్ఘకాలిక సంస్కరణ. పార్టీల ఖర్చుపై పరిమితి ఉండాలని, తదునుగుణంగా పార్టీలకు అందే నిధుల విషయంలో పారదర్శకత ఉండాలని ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఎన్నికల సంఘం నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశం సిఫారసు చేసింది. రాబోయే కాలంలో ఈ నిబంధన అమలులోకి వస్తుంది అని ఆయన తెలిపారు. ఖర్చుపై పరిమితి అనే అంశంపై అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయని రావత్ చెప్పారు. ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు ఖర్చుపై పారదర్శకత కోసం ఎన్నికల సంఘం గొప్ప కృషి చేసిందని అన్నారు.

1130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles