భానుడి భగభగలు

Wed,April 19, 2017 03:53 PM

Sun stroke in telangana state

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 7 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం 5 గంటలకు కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, నల్లగొండలో 43 డిగ్రీలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో 44 డిగ్రీలు, రామగుండం, హైదరాబాద్, భద్రాచలంలో 42 డిగ్రీలు, హన్మకొండ, ఖమ్మంలో 41, హకీంపేటలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నది. మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉన్నది. తెలంగాణలో ఎండలు అధికమవుతున్న నేపథ్యంలో పాఠశాలలకు విద్యాశాఖ రేపట్నుంచి సెలవులను ప్రకటించింది.

2565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles