ఎండలు మండిపోతున్నాయి..

Sat,April 15, 2017 04:42 PM

sun stroke in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల కారణంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. కోల్ బెల్ట్ ఏరియా నిప్పుల కొలిమిలా మారింది. అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్‌లో 43 డిగ్రీలు, నిజామాబాద్‌లో 42, భద్రాచలం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండలో 41, హైదరాబాద్, హన్మకొండలో 40, ఖమ్మం, హకీంపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎండలు పెరిగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

1612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles