భానుడి భగభగకు ‘భాగ్యనగరం’ విలవిల

Mon,April 17, 2017 05:37 PM

sun stroke in hyderabad

హైదరాబాద్ : ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. భానుడి భగభగకు భాగ్యనగరం విలవిలలాడి పోతున్నది. నగరంలో ఎండలు మండిపోతున్నాయి. మండుటెండలకు ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. సోమవారం హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంతో పోలిస్తే 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం, సాయంత్రం వేళల్లోనే ప్రజలు బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు వైద్యులు.

1266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles