కీతవారిగూడెం శివాలయంలో పార్వతీదేవిని తాకిన సూర్యకిరణాలు

Wed,January 9, 2019 06:38 PM

sun rays touched parvathi devi idol in shiva temple in suryapet district

సూర్యాపేట: జిల్లాలోని గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం శ్రీ పార్వతీ రామలింగేశ్వరస్వామి దేవాలయంలోని పార్వతీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఇవాళ సూర్యకిరణాలు తాకాయి. దక్షిణాయనం చివరి సమయంలో సూర్య కిరణాలు అమ్మవారి విగ్రహాన్ని తాకడం శుభసూచకంగా భావించవచ్చని, ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకుడు శ్రీరామయ్యశర్మ తెలిపారు. పార్వతీదేవి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకాయని తెలియడంతో గ్రామస్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles