30 మంది నుంచి రూ. 50 లక్షల వరకు వసూలు

Sat,March 16, 2019 08:11 AM

sun pad it software solutions jobs fraud

హైదరాబాద్ : ఐటీ కంపెనీల్లో ఎటువంటి ఉద్యోగావకాశాలు లేనప్పటికీ కొందరు ఆసరాగా చేసుకొని అమాయకులను మోసానికి గురిచేస్తున్నారు. ఇటీవల మాదాపూర్‌లోని సన్‌మ్యాక్స్ కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని దాదాపు 500 మంది వద్ద రూ. 5 కోట్లు వసూలు చేసి ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. ఆ సంఘటన మరువక ముందే మాదాపూర్ అయ్యప్పసొసైటీలోని సన్ ప్యాడ్ ఐటీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ పేరిట ఏర్పాటు చేసిన సంస్థ దాదాపు 30 మంది వద్ద రూ. 90 వేల నుంచి 2 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం .. గుంటూరుకు చెందిన సురేశ్ (35) రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి అయ్యప్పసొసైటీలోని సన్‌ప్యాడ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా చేరాడు. దీంతో ఎలాగైన పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఉద్యోగం కోసం వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకున్నాడు. కంపెనీని అభివృద్ధి చేసి మంచి ఉద్యోగం కల్పిస్తానని మాయమాటలు చెప్పి ఇందులో దాదాపు 30 మంది వద్ద రూ. 50 లక్షల వరకు వసూలు చేశాడు. అయితే కొత్తగూడలో నివాసం ఉంటున్న సాయినాథ్ (23) అనే వ్యక్తి ఉద్యోగం కోసం సన్‌ప్యాడ్ ఐటీ సొల్యూషన్‌ను సంప్రదించాడు.

ఇందులో పెట్టుబడులు పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని అతడిని నమ్మించి దాదాపు రూ. లక్ష వసూలు చేశాడు. గురవారం సాయంత్రం హెచ్‌ఆర్ సురేశ్‌ను కలుద్దామని కంపెనీ వద్దకు వచ్చిన బాధితుడు.. మూసి ఉండటంతో హెచ్‌ఆర్ సురేశ్‌కు ఫోన్ చేశాడు. స్విచ్‌ఆఫ్ రావడం..మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో సంస్థలో పెట్టుబడులు పెట్టిన మరికొంత మంది అసలు విషయాన్ని తెలుసుకొని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles