డాక్టర్ బీవీ.పట్టాభిరామ్ నేతృత్వంలో 7న శిక్షణా తరగతులు

Fri,May 4, 2018 08:56 AM

Summer Special for Kids Prasanthi Counselling

తెలుగుయూనివర్సిటీ : ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ.పట్టాభిరామ్ నేతృత్వంలో 8నుండి 14సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలకు మే7 నుండి నాలుగు రోజుల పాటు వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించనున్నామని ప్రశాంతి కౌన్సిలింగ్ సెంటర్ ఈ1 నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, చేతి రాత మెరుగు పరచుకోవడానికి మెళకువలు, మేజిక్, వ్యకిత్వ వికాసం రిపోర్టు తదితర అంశాలపై నామమాత్రపు ఫీజుతో సేవాభావంతో ఆయా అంశాలల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని తెలిపారు. 7నుంచి మొదటి బ్యాచ్, 14నుండి రెండో బ్యాచ్, 21నుండి 3వ బ్యాచ్, 28నుండి చివరి బ్యాచ్ ఉంటుందని, ఉదయం 10గంటలనుండి సాయంత్రం 4వరకు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలకు ప్రశాంతి కౌన్సిలింగ్ సెంటర్ ఈ1, సామ్రాట్ కాంప్లెక్స్, సెక్రటేరియట్ రోడ్డు, 9849002702 లో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు.

1183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles