సమ్మర్‌ సమురాయ్‌ అద్భుతమైన కార్యక్రమం: కొప్పుల

Mon,April 15, 2019 02:33 PM

summer samurai 2019 camps start in telangana

ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సమ్మర్‌ సమురాయ్‌ క్యాంపులను సచివాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుకుల సంక్షేమ విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. గురుకుల విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. వేసవిలో క్రీడల ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందేలా కార్యక్రమాలు రూపొందించామన్నారు. వెయ్యి మందితో ప్రారంభమైన క్యాంపు... ఇప్పుడు లక్ష మంది వరకు చేరుకుందని పేర్కొన్నారు. 2013 నుంచి ప్రారంభమైన సమ్మర్‌ సమురాయ్‌ క్యాంపు చాలా గొప్పగా జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. సీఎంకేసీఆర్‌ నాయకత్వంలో గురుకుల పాఠశాలల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. 2014 నుంచి గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో గురుకులాలను ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు.

621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles