పాలమూరు మండిపోతున్నది

Thu,April 13, 2017 03:19 PM

summer in telangana

హైదరాబాద్ : భానుడి భగభగకు దేశంలో రాజస్థాన్, తెలంగాణలో పాలమూరు మండిపోతున్నది. మండే ఎండలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. భద్రాచలం 42, నిజామాబాద్‌లో 42, ఆదిలాబాద్ 41, ఖమ్మం 41, మెదక్ 41, నల్లగొండ 41, రామగుండం 41, హైదరాబాద్ 40, హన్మకొండ 40, హకీంపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సాధారణం కంటే సగటున 3 నుంచి 5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయి.

రాగల రెండు రోజుల పాటు ఉష్ణగాలుల ప్రభావం కొనసాగనుంది. సౌరాష్ట్ర కచ్ వైపు నుంచి ఉష్ణగాలులు వీస్తున్నాయి. ఉష్ణగాలుల ప్రభావంతో మధ్యప్రదేశ్, మరాట్వాడాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్‌లోని సురేంద్రనగర్‌లో 45 డిగ్రీలు, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతం దార్మేర్‌లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుజరాత్‌లోని కాండ్ల, భీరలో 44.5 డిగ్రీలు, గాంధీనగర్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles