అంగన్‌వాడీ సిబ్బందికి సెలవులు

Thu,May 2, 2019 07:21 AM

15 వరకు టీచర్లకు, 30 వరకు ఆయాలకు..
హైదరాబాద్: వేసవి నేపథ్యంలో అంగన్‌వాడీ సిబ్బందికి సెలవులు మంజూరు చేస్తూ మహిళా శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు, ఆయాలకు వేర్వేరుగా సెలవులను కేటాయించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఉపాధ్యాయులకు, 15 నుంచి 30వ తేదీ వరకు ఆయాలకు సెలవులను ఇచ్చింది. ఈ నెలలో మొదటి 15 రోజులు ఉపాధ్యాయులకు, తర్వాతి 15 రోజులు ఆయాలు సెలవులుగా తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో అంగన్‌వాడీల సమయంలోనూ ఇది వరకే మార్పులు చేశారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకే నడుపాలని ఆదేశాలు జారీచేశారు. ప్రీ స్కూళ్లలోని పిల్లలను ఉదయం 11:30 గంటల వరకే ఇండ్లకు పంపించాలని సూచించారు.

3048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles