నల్లగొండ జిల్లాలో అకాల వర్షం

Sun,April 29, 2018 10:18 PM

Sudden rain in nalgonda district

నల్లగొండ: జిల్లాలోని చిట్యాల, చింతపల్లి మండలాల్లో ఇవాళ సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. చిట్యాల మండలం పెద్దకాపర్తిలో మేకలు కాయడానికి వెళ్లిన రైతు నార్లకొండ నర్సింహ్మ (38) పిడుగుపాటుకు మృతి చెందాడు. గుండ్రాంపల్లిలో పోల్‌రెడ్డి మహేందర్‌రెడ్డికి చెందిన రెండు బర్రెలపై చెట్టు విరిగి పడడంతో మృతి చెందాయి. అదే గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బొడిగె ప్రణతిపై కూడా చెట్టుకొమ్మ విరిగి పడగా తలకు తీవ్ర గాయమైంది. పలు గ్రామాల్లో సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసింది. మామిడి తోటల్లో కాయలు రాలి నష్టం వాటిల్లింది. చింతపల్లి మండలంలో పిడుగు పాటుకు మూడు గొర్రెలు, 8 మేకలు మృతి చెందాయి.

2800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles