ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షం

Sat,January 26, 2019 08:37 PM

sudden rain in erstwhile warangal dist

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడి జల్లులు పడ్డాయి. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్, కమలాపూర్, భీంపల్లి, కన్నూరు, గుండేడు, దేశరాజ్‌పల్లి, గూడూరు తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కమలాపూర్‌లోని పర్కాల-హుజురాబాద్ ప్రదాన రహదారి వెంట నూతనంగా వేసిన విద్యుత్ లైన్ స్తంభాలు ఒరిగాయి. గ్రామంలో వరద నీరు పోటెత్తడంతో పర్కాల-హుజురాబాద్ రహదారిపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఊహించని విధంగా వర్షం కురవడంతో యాసంగిలో వరి సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ బావుల్లో భూగర్భ నీటిమట్టం తగ్గిపోతున్న తరుణంలో వర్షం వల్ల సాగునీటి సమస్య కొంత తీరినట్లయిందని చెబుతున్నారు.

జనగామ పట్టణంలో చిరుజల్లులు కురిశాయి. వాతావరణం చల్లబడి ఈదురుగాలులు వీచాయి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట, వర్థన్నపేట ప్రాంతాల్లో చలిగాలులు వీచాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. టేకుమట్ల, మొగుళ్లపల్లి, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో కురిసిన వర్షానికి మిర్చి, పత్తి పంటలు తడిసిమద్దయ్యాయి. మరో రోజు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

3426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles