సూర్యాపేట జిల్లాలో పలు చోట్ల నేలరాలిన మామిడి, వరి, నిమ్మసూర్యాపేట జిల్లా తిరుమలగిరి, అర్వపల్లి, నాగారం మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన స్వల్ప వర్షం కురిసింది. దీంతో పంటలకు కొంత మేర నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న వరితోపాటు మామిడి, నిమ్మ కాయలు నేలరాలాయి. పలుచోట్ల తోటల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇండ్ల కప్పులు లేచిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు సైతం ఒరిగిపడ్డాయి. కల్లాల వద్ద ధాన్యం రాశులు పోయగా వర్షం నుంచి తప్పించేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు.