సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి లక్ష్మారెడ్డి

Fri,April 7, 2017 09:57 PM

subsidy tractors distribute by Laxma Reddy

మహబూబ్‌నగర్ : ప్రభుత్వం సాగుకు ప్రాధాన్యతనిస్తూ సాగునీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో సబ్సిడీపై ట్రాక్టర్లను మంత్రి పంపిణీ చేశారు. వెనుకబడిన ఉమ్మడి పాలమూరులో ఇప్పటికే 60 శాతం సస్యశ్యామలమైందని, పల్లె బాగుపడితే రాష్ట్రం, దేశం బాగు పడతాయని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మరో రెండేళ్లల్లో పాలమూరు జిల్లాను మరో కోనసీమగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, జేడీఏ సుచరిత, ఆత్మ పీడీ హుక్యానాయక్ పాల్గొన్నారు.

728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles