వ్యర్థాల వినియోగంపై అధ్యయనం

Fri,February 15, 2019 10:19 PM

Study on waste use in tsiic

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యర్థపదార్థాలను వినియోగించుకోవడంపై నీతిఆయోగ్‌, జర్మనీకి చెందిన జీషెల్‌ షాఫ్ట్‌ ఇంటర్నేషనల్‌ జూసమ్మెనార్‌బీట్‌ (జీఐజెడ్‌) ప్రతినిధులు అధ్యయనం చేస్తున్నారు. శుక్రవారం టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో ‘సర్క్యులర్‌ ఎకానమీ అండ్‌ రిసోర్స్‌ ఏఫిషియెన్సీ స్ట్రాటజీ అండ్‌ యాక్షన్‌ ప్లాన్‌' అంశంపై సదస్సు నిర్వహించారు. వ్యర్థాలు పర్యావరణహితంగా ఉండే విధంగా ఉండటం, వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మాజీకార్యదర్శి తిష్యారక్షిత్‌ చటర్జీ, జీఐజెడ్‌ డిప్యూటీ టీం లీడర్‌ రచన ఆరోరా, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, నీతిఆయోగ్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ బీఎన్‌ శత్పథి, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి ప్రసంగించారు. ఈ రంగంలో ప్రఖ్యాతిగాంచిన సంస్థ జీఐజెడ్‌ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles