ల్యాప్‌టాప్ ఉందా ... వెబ్ కాస్టింగ్ కోసం అప్లై చేసుకోండి...

Sat,March 16, 2019 06:40 AM

Students with laptops invited for poll webcasting

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానంతో సత్ఫలితాలు రావడంతో లోక్‌సభ ఎన్నికలోనూ అమలు చేయా లని నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని కనీసం 10 శాతం పోలింగ్ బూత్‌ల్లో వెబ్‌కాస్టింగ్ అమలుచేయాలి. తెలంగాణలో 34,603 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటుచేయనుండగా.. నాలుగువేల పోలింగ్ బూత్‌ల్లో వెబ్‌కాస్టింగ్ పెట్టనున్నారు. ఈ మేరకు సరిపడా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉన్నా మానవ వనరుల కొరత ఏర్పడే అవకాశం ఉన్నది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 11 నుంచి జరిగే పోలింగ్‌ను లైవ్ వెబ్‌కాస్టింగ్ చేయడానికి ఆసక్తిగలవారు తమ పేర్లను https://bit.ly/webcat-2019అనే వెబ్‌సైట్ ద్వారా కానీ, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా కానీ నమోదు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ ఐటీ విభాగం అదనపు కమిషనర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అలాగే, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల సీనియర్ ఇంజినీరింగ్ విద్యార్థులు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. అంతేకాకుండా సొంత ల్యాప్‌టాప్‌గల అభ్యర్థులు election swebcasting2019@gmail.com ను సంప్రదించాలన్నారు. వెబ్‌కాస్టింగ్ విధుల్లో పాల్గొనేవారికి తగిన పారితోషికంతో పాటు సర్టిఫికెట్ జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అందలేదని టీచ ర్లు, ఇతర ఎన్నికల సిబ్బంది నుంచి ఫిర్యాదులు వచ్చినందున ఈ సారి పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నది. పోస్టల్ బ్యాలెట్ ఎంత మందికి అం దింది? ఎవరికి చేరలేదు? ఓటు రిటర్నింగ్ అధికారికి వెళ్లిందా? లేదా? వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం కలుగనుంది.

1507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles