స్నేహితులు కొట్టారని విద్యార్థి ఆత్మహత్య

Thu,June 6, 2019 03:52 PM

student suicide on railway track at jangaon

జనగామ: జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన బోగ ప్రభాకర్, లక్ష్మీల కుమారుడు సాయి ప్రసాద్ అనే విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు కొట్టడంతో అవమానం జరిగిందని, అందుకే చనిపోతున్నానని సుసైడ్ నోట్ రాసి చనిపోయాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు సాయిప్రసాద్ శవంతో అతడి స్నేహితులు పవన్, వరుణ్‌ల ఇంటి ముందు ధర్నాకు దిగారు. తన కుమారుడిని కొట్టినవారిని అరెస్టు చేయాలని మృతుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ వినోద్ కుమార్ బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులకు శిక్షపడేలా చేస్తామని పోలీసులు సాయిప్రసాద్ తల్లిదండ్రులకు హామి ఇచ్చారు.

1704
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles