కాల్వలో పడి విద్యార్థి మృతి

Tue,November 14, 2017 09:30 PM

student died in Cenal

నల్లగొండ : నల్లగొండ జిల్లాకేంద్రం శివారులోని అక్కలాయిగూడెం జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి బహిర్భూమికి వెళ్లి కాల్వలో మునిగి మృతిచెందాడు. ఇదే ఘటనలో మరో విద్యార్థిని స్థానికులు కాపాడగలిగారు. అక్కలాయిగూడేనికి చెందిన వల్లపు రమేష్, రాధకు కుమారుడైన విజయేందర్ (11)స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం 2గంటలకు సహ విద్యార్థి సైదులుతో కలిసి బహిర్భూమికి వెళ్లి పక్కనే డి.37 కాల్వలో జారిపడ్డారు. విజయేందర్ నీటిలో కొట్టుకుపోగా.. సైదులు దరిని పట్టుకుని కేకలు వేయడంతో అక్కడ నుంచి వెళ్తున్న ఏడో తరగతి విద్యార్థులు వంశీ, రాములు కర్రసాయంతో సైదులును పైకి లాగి కాపాడారు. ఫైర్‌స్టేషన్ సిబ్బంది కాల్వలో గాలించి విజయేందర్ మృతదేహాన్ని వెలికితీశారు.

934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS