పెళ్లి వేడుకకు వచ్చి అనంతలోకాలకు..

Mon,May 20, 2019 11:14 PM

student died by drowning in cheetakoduru reservoir in jangaon dist

- రిజర్వయర్‌లో మునిగి విద్యార్థి మృతి
- స్నేహితుల కళ్లెదుటే ఘటన
- మృతుడు హైదరాబాద్ వాసి

జనగామ: హైదరాబాద్ నుంచి పెళ్లి వేడుకకు వచ్చిన ఓ విద్యార్థి రిజర్వాయర్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జనగామ జిల్లాలోని చీటకోడూరు గ్రామ రిజర్వాయర్ వద్ద జరిగింది. స్థానికులు, స్నేహితుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని రాంనగర్‌ గుండు ప్రాంతానికి చెందిన పాతకోట శ్రీనివాస్-జానకి క్యాటరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి రెండో కుమారుడైన పాతకోట నాగసాయి(18) ఇటీవల ఇంటర్ పూర్తి చేసుకున్నాడు.

జనగామ పట్టణంలో తన స్నేహితుడి బంధువుల ఇంట్లో పెళ్లి వేడుక ఉండడంతో హాజరయ్యేందుకు తన మిత్రులతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి సరదాగా స్నానం చేసేందుకు జనగామ మండలం చీటకోడూరు గ్రామంలోని రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. నాగసాయి రిజర్వాయర్‌లోకి మెట్ల ద్వారా దిగుతుండగా కాలు జారి పడిపోయాడు. అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగాడు. వెంటనే అతడి స్నేహితులు రక్షించే ప్రయత్నం చేశారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నాగసాయి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.

2997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles