మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత

Wed,March 20, 2019 10:48 PM

Strong security in the Maoist affected areas

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల బందోబస్తులో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ఠమైన నిఘా పెట్టినట్టు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (శాంతి,భద్రతలు) జితేందర్‌ తెలిపారు. చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాల్లో ఇప్పటికే మన రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించినట్టు వెల్లడించారు. మావోయిస్టుల అలజడి ఉన్నట్టుగా సమాచారం అందిన ప్రాంతాల్లో కౌంటర్‌ యాక్షన్‌ టీంలను రంగంలోకి దింపినట్టు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించినట్టుగానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా వ్యూహాలు రచిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లైసెన్స్‌ కలిగివున్న తుపాకులను స్వాధీనం చేసుకొంటున్నామని, నాన్‌బెయిలబుల్‌ వారంట్లను కూడా జారీచేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల బందోబస్తు విధుల కోసం రాష్ర్టానికి చేరుకొన్న కేంద్ర బలగాలను ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్ని జిల్లాలకు పంపినట్టు చెప్పారు. సున్నితమైన పోలింగ్‌స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పని కొనసాగుతున్నదని పేర్కొన్నారు.

487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles