సింగరేణిలో సమ్మె ప్రభావం లేదుMon,June 19, 2017 01:43 PM
సింగరేణిలో సమ్మె ప్రభావం లేదు

హైదరాబాద్ : సింగరేణిలో సమ్మె ప్రభావం లేదని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. ఐదో రోజు 76 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారని తెలిపింది. సమ్మె ప్రారంభమైన మొదటి రోజుతో పోలిస్తే ఐదో రోజు 44 శాతం అధికంగా కార్మికులు హాజరయ్యారు. సగటున రోజుకు జరిగే ఉత్పత్తి 1,52,186 టన్నులు కాగా, సమ్మె కాలంలో నాలుగు రోజుల్లో సరాసరి ఉత్పత్తి 1,71,567 టన్నులు. సాధారణ రోజువారీ సగటు ఉత్పత్తి కన్నా 13 శాతం అధికంగా ఉందని వెల్లడించింది. రోజువారీ సగటు బొగ్గు రవాణా 1,64,000 టన్నులు కాగా, సమ్మె కాలంలో నాలుగు రోజుల్లో సరాసరి బొగ్గు రవాణా 1,76,271 టన్నులు. ఇది సగటు రవాణా కన్నా 13 శాతం అధికంగా ఉందని తెలిపింది. జూన్ నెల బొగ్గు రవాణాలో రోజువారీ సగటు 25 రైల్వేరేక్స్ కాగా, సమ్మె నాలుగో రోజు సరాసరి 30 రైల్వే రేక్స్ బొగ్గును రవాణా చేసినట్లు ప్రకటించింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలైన ఎన్టీపీసీ, ఎస్‌టీపీసీ, జెన్‌కోలకు బొగ్గు సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది.

475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS