పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి: నాగిరెడ్డి

Wed,May 15, 2019 04:38 PM

state election commissioner nagireddy press meet on parishad elections

హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. తక్కువ సమయంలోనే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏడు చోట్ల ఇబ్బందులు తలెత్తాయన్న నాగిరెడ్డి.. ఈనెల 27న కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. 123 ప్రాంతాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని.. ఒక్కో ఎంపీటీసీకి రెండు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

1284
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles