స్టార్టప్.. జీవితాన్నే మార్చేసింది

Sun,October 13, 2019 08:15 AM

హైదరాబాద్ : మూడేండ్ల క్రితం అతడు ఓ సాధారణ ఉద్యోగి. అయితే అదే జీవితం అనుకోలేదు. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని భావించాడు. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లకు ఊపిరి నిస్తున్న తరుణంలో అతడిలో ఓ ఆలోచన రేకెత్తింది. తక్కువ ఖరీదులో నాణ్యమైన..అన్ని సదుపాయాలు కలిగిన బ్యాగును అందించాలనుకున్నాడు. అందులో భాగంగానే బీప్లగ్‌డ్ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. తన మిత్రుడి సహకారంతో కర్బొనాడో బ్యాగును తయారు చేసి కస్టమర్ల ఆదరణ చూరగొన్నాడు చామ ప్రదీప్ రెడ్డి. నగరంలోని హయత్‌నగర్‌కు చెందిన సందీప్‌రెడ్డి స్టార్టప్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొందాడు. బెంగళూరు కేంద్రంగా విదేశాలకు కర్బనాడో బ్యాగులను ఎగుమతి చేస్తున్నారు. స్టార్టప్‌తో 140 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.


బ్యాగు ప్రత్యేకతలు..


కర్బొనాడో బ్యాగు.. ప్రస్తుతం మార్కెంట్లో లభించే బ్యాగుల కన్నా ఆకర్షణీయంగా ఉన్నది. ల్యాప్‌టాప్, కెమెరా పెట్టుకునేందుకు ప్రత్యేకంగా పౌచ్‌లు రూపొందించారు. అందులో ఇన్సులేటెడ్ పౌచ్ ఏర్పాటు చేశారు. దాంట్లో వాటర్ బాటిల్ పెడితే.. కూల్ అయ్యే విధంగా తయారు చేశారు. డిజైన్ టెక్నాలజీ సాయంతో బ్యాగుకు మెరుగులు దిద్దారు. వెయిట్ బ్యాలెన్స్ టెక్నాలజీతో భుజాలపై బరువు ఎక్కువగా పడకుండా రూపొందించడం విశేషం. వాటర్ ప్రూఫ్ బ్యాగు. బ్యాగు పై భాగాన పాలికార్బొనేట్ సాయంతో రెడ్, బ్లూ, బ్లాక్ కలర్స్‌తో పట్టీని ఏర్పాటు చేశాడు. మొత్తంగా ఈ బ్యాగుపై 120 కేజీల బరువు పెట్టినా.. అందులో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎలాంటి డ్యామేజీ కలగకుండా ఉంటుంది. 18 నెలలు అనేక ఆలోచనలు.. వాటికి డిజైన్స్ ఐప్లె... తుదకు కర్బొనాడో బ్యాగు కార్యాచరణలోకి వచ్చింది. ఈ బ్యాగు ధర రూ. 2,999. మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్‌లో బిప్లగ్‌డ్ వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వ్యవస్థాపకుడు ప్రదీప్ రెడ్డి తెలిపారు.

స్టార్టప్‌లకు చేయూతనిచ్చింది మంత్రి కేటీఆరే


స్టార్టప్‌లకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహమే నాలో ఆలోచన రేకెత్తేలా చేసింది. స్టార్టప్‌లకు మంత్రి కేటీఆర్ ఊపిరినిచ్చాడు. ఏదో ఒకటి సాధించాలనే సంకల్పంతోనే బిప్లగ్‌డ్ స్టార్టప్‌ను స్థాపించాను. కర్బొనడో బ్యాగును తయారు చేశాను. వినియోగదారుల అవసరాలకు తగ్గట్గుగా బ్యాగును డిజైన్ చేశాను. అందుకు నాకు అవార్డు కూడా వచ్చింది. త్వరలో హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాను.
- చామ ప్రదీప్ రెడ్డి, బీప్లగ్‌డ్ వ్యవస్థాపకుడు, హయత్‌నగర్

1682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles